తెలంగాణ

telangana

ETV Bharat / international

కరాచీలో విమాన ప్రమాదం- 100మందికిపైగా మృతి - పాక్​ విమానన క్రాష్​

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పాకిస్థాన్​ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. లాహోర్‌ నుంచి కరాచీకి వస్తున్న ఈ విమానంలోని 107 మంది మరణించారు.

PAK PLANE CRASH
ఘోర ప్రమాదం: కరాచీలో కుప్పకూలిన విమానం

By

Published : May 22, 2020, 4:45 PM IST

Updated : May 22, 2020, 7:27 PM IST

కరోనా లాక్​డౌన్​లో కొద్దిపాటి విమానాలకు అనుమతించిన వారం రోజులకే పాకిస్థాన్​ కరాచీలో ఘోర ప్రమాదం జరిగింది. జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నివాస ప్రాంతంలో పాక్​ అంతర్జాతీయ ఎయిర్​ లైన్స్​ (పీఐఏ)కు చెందిన ఏ-320 విమానం కుప్పకూలింది. అందులోని మొత్తం 107 మంది ప్రాణాలు కోల్పోయారు.

పాక్​లో ఘోర వమానప్రమాదం

లాహోర్​ నుంచి వస్తోన్న పీకే-8303 విమానం కరాచీ విమానాశ్రయంలో దిగాలి. కానీ ల్యాండింగ్​కు కొద్ది నిమిషాలకు ముందు కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 99 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు.

" రాడార్​తో సంబంధాలు తెగిపోయే ముందు ల్యాండింగ్​ గేర్​లో సమస్యలు తలెత్తినట్లు కెప్టెన్​ ఎయిర్​ ట్రాఫిక్​ టవర్​కు సమాచారం ఇచ్చాడు. రెండు విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయని పైలట్​కు తెలియజేశాం. ల్యాండింగ్​ చేసేందుకు 2-3 సార్లు ప్రయత్నించాడు. కానీ, ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది. "

– గులామ్​ సర్వార్​, విమానయానశాఖ మంత్రి.

ఇళ్లు ధ్వంసం

మాలిర్​ ప్రాంతంలోని మోడల్​ కాలనీ వద్ద విమానం కూలిపోవటం వల్ల సుమారు 10 ఇళ్లు, పలు కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. కూలిపోయిన ఇళ్లల్లో నుంచి ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఎంతమంది గాయపడ్డారనే విషయం ఇంకా తెలియరాలేదని, ఆచూకీ లభించిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

సంఖ్యపై సందిగ్ధం..

విమానంలో ఎంత మంది ఉన్నారనే విషయంలో సందిగ్ధం నెలకొంది. విమానయాన సంయుక్త కార్యదర్శి సత్తార్​ ఖోఖర్​.. 99 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారని చెప్పగా.. పీఐఏ ప్రతినిధి అబ్దుల్లా హఫీజ్​ మాత్రం 91 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు.

దర్యాప్తునకు ఆదేశం..

ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పాక్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రమాదంపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు పాక్​ అధ్యక్షుడు అరిఫ్​ అల్వీ.

మోదీ ట్వీట్​..

పాకిస్థాన్ విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్​ చేశారు.

మోదీ ట్వీట్​
విమానప్రమాద దృశ్యం
ఆసుపత్రికి తరలిస్తున్న సహాయక సిబ్బంది
సహాయకచర్యలు ముమ్మరం
ఘటనాస్థలానికి అంబులెన్స్​లు
Last Updated : May 22, 2020, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details