తెలంగాణ

telangana

ETV Bharat / international

కీలక భేటీలతో ఉత్కంఠగా నేపాల్​ రాజకీయాలు - నేపాల్​ ప్రధాని కపీ శర్మ ఓలి

నేపాల్​ ప్రధాని ఓలి రాజకీయ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా ప్రధానితో అధికార నేపాల్​ కమ్యూనిస్ట్​ పార్టీ అధ్యక్షుడు.. పుష్ప కమల్​ దహల్ ప్రచండ​ భేటీ అయ్యారు. సోమవారం జరగనున్న స్టాండింగ్​ కమిటీ సమావేశానికి ముందు ఇరు నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

after-meeting-president-bidya-devi-bhandari-nepal-communist-party-ncp-leader-pushpa-kamal-dahal-is-holding-talks-with-pm-kp-oli
కీలక భేటీలతో ఉత్కంఠగా నేపాల్​ రాజకీయాలు

By

Published : Jul 5, 2020, 2:05 PM IST

Updated : Jul 5, 2020, 5:14 PM IST

నేపాల్​లో రాజకీయ పరిణామాలు తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తున్నాయి. సమావేశాలు, చర్చలతో అధికార నేపాల్​ కమ్యూనిస్ట్​ పార్టీ(ఎన్​సీపీ) నేతలు బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా.. బలువతార్​లో ప్రధాని కేపీ శర్మ ఓలీతో.. ఎన్​సీపీ అధ్యక్షుడు పుష్ప కమల్​ దహల్ ప్రచండ​ భేటీ అయ్యారు. ఓలి రాజకీయ భవితవ్యాన్ని తేల్చే ఎన్​సీపీ స్టాండింగ్​ కమిటీ సోమవారం భేటీకానున్న నేపథ్యంలో.. వీరి సమావేశానికి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

అంతకుముందు.. నేపాల్​ అధ్యక్షురాలు విద్యా దేవీ భండారీతో ఆదివారం ఉదయం పుష్ప కమల్​..​ భేటీ అయ్యారు. వీరి మధ్య జరిగిన చర్చల వివరాలు ఇంకా తెలియరాలేదు.

చిక్కుల్లో ఓలి...

భారత్​పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఓలిపై సొంత పార్టీ నేతలే ఆగ్రహంగా ఉన్నారు. ఈ మేరకు ఓలి రాజీనామా చేయాలని పార్టీ అధ్యక్షుడితో సహా చాలా మంది నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇందుకు సంబంధించి శనివారమే స్టాండింగ్​ కమిటీ భేటీ జరగాల్సి ఉంది. కానీ పలు కారణాలతో సోమవారానికి వాయిదా పడింది.

ప్రధాని ఓలి కూడా తన బలగాలను సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు శనివారం రాత్రి తన మంత్రులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తనను గద్దెదించడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఓలి. ఏదైనా జరగవచ్చని.. అందరూ సిద్ధంగా ఉండాలని మంత్రులకు సూచించారు.

ఇదీ చూడండి:-ఈ తప్పిదాలతో నేపాల్​ స్నేహాన్ని భారత్ కోల్పోతోందా?

Last Updated : Jul 5, 2020, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details