తెలంగాణ

telangana

ETV Bharat / international

అఫ్గానిస్థాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా సలేహ్ - afghanistan caretaker president

AFGHAN VICE PRESIDENT
అఫ్గానిస్థాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా సలేహ్

By

Published : Aug 17, 2021, 8:05 PM IST

Updated : Aug 17, 2021, 9:09 PM IST

20:00 August 17

అఫ్గానిస్థాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా సలేహ్

అఫ్గానిస్థాన్ తొలి ఉపాధ్యక్షుడు అమ్రులా సలేహ్.. తనను తాను దేశ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం అన్ని వర్గాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తాను ఇప్పుడు దేశంలోనే ఉన్నానని చెప్పారు సలేహ్. అధ్యక్షుడు లేనిపక్షంలో ఉపాధ్యక్షుడే ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ఉంటారని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

"అఫ్గానిస్థాన్ రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు మరణించినా, గైర్హాజరులో ఉన్నా, పారిపోయినా.. ఉపాధ్యక్షుడే ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ఉంటారు. నేను ఇప్పుడు దేశంలోనే ఉన్నా. చట్టబద్ధంగా నేనే ఆపద్ధర్మ అధ్యక్షుడిని. అందరి మద్దతు కూడబెట్టేందుకు నేతలను కలుస్తున్నా."

-అమ్రుల్లా సలేహ్

తాలిబన్లకు లొంగేది లేదు..

భవిష్యత్తులో తాను తాలిబన్లకు లొంగిపోయే ఉద్దేశం లేదని సలేహ్ ప్రకటించారు. పంజ్‌షిర్‌ లోయలోకి తాలిబన్లను రానీయకుండా తాము పోరాడుతామని ఆయన ప్రకటించారు. "నాపై నమ్మకం ఉంచి.. నామాట వినే లక్షల మందిని నేను నిరాశ పర్చను. నేను ఎప్పుడూ తాలిబన్లతో కలిసి పనిచేయను. అది ఎప్పటికి జరగదు" అని ఆయన ఆదివారం ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత ఆయన అహ్మద్‌ షా మసూద్‌ కుమారుడితో కలిసి హెలికాప్టర్‌లో హింద్‌ కుష్‌కు వెళ్లిపోయారు. తాలిబన్లను ఎదుర్కొనేందుకు ఆయన మసూద్‌ కుమారుడితో కొలిసి గెరిల్లా యుద్ధం చేసే అవకాశం ఉంది. 

1990ల్లో జరిగిన యుద్ధ సమయంలో కూడా పంజ్‌షిర్‌లోయను తాలిబన్లు ఆక్రమించలేకపోయారు. అంతకు ముందు రష్యా దురాక్రమణను కూడా ఈ లోయ తట్టుకొని నిలబడింది. "మేము తాలిబన్లను పంజ్‌షిర్‌  ప్రాంతంలోకి అడుగు పెట్టనీయం. మా శక్తియుక్తులు ధారపోసి వారిని పోరాడుతాము" స్థానికులు ఓ ఆంగ్ల వార్త సంస్థకు వెల్లడించారు. 

సలేహ్‌కు గెరిల్లా దళాలకు కమాండర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. 1996లో తాలిబన్లను కాబుల్‌ను ఆక్రమించ ముందు ఆయన ప్రభుత్వంలో కూడా పనిచేశారు. 2001లో అమెరికా దళాలు తాలిబన్లను తరిమి కొట్టే సమయంలో సీఐఏకు సలేహ్‌ సహకరించారు. 

Last Updated : Aug 17, 2021, 9:09 PM IST

ABOUT THE AUTHOR

...view details