తమ దేశానికి 5లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపించినందుకు భారత్‌కు ధన్యవాదాలు తెలిపింది అఫ్గానిస్థాన్. ఇది భారత్ నిబద్ధత, ఔదార్యానికి నిదర్శనమని కొనియాడింది. కష్టకాలంలో తమను ఆదుకున్నందుకు భారత ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అఫ్గాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ హనీఫ్ ఆత్మర్.
అఫ్గాన్‌కు టీకాలను పంపించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. టీకా డోసులు ఆదివారం ఆ దేశంలో అడుగుపెట్టాయి. అంతకుముందు దాదాపు 20మెట్రిక్ టన్నుల వైద్య సామాగ్రిని అఫ్గానిస్థాన్‌కు పంపింది భారత ప్రభుత్వం.