అమెరికా తన సేనలను వేగంగా ఉపసంహరించుకోవడమే అఫ్గాన్‌లో హింసకు కారణమని ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘని అన్నారు. సెప్టెంబర్ 11లోపు అఫ్గాన్ నుంచి తమ సేనలు వైదొలగుతాయని కొన్నాళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. అయితే ఈ ఉపసంహరణ ప్రక్రియ చాలా వేగంగా సాగింది. దీంతో తాలిబన్లు దూకుడు పెంచారు. చాలా ప్రావిన్స్‌ల్లో జిల్లాలను ఆక్రమించుకున్నారు.
ఈ నేపథ్యంలో అఫ్గాన్ పార్లమెంటులో ఘని మాట్లాడుతూ.. తాలిబన్లతో సయోధ్య కుదుర్చుకోవాలంటూ అమెరికా తెచ్చిన శాంతి ప్రక్రియను తొందరపాటు చర్యగా అభివర్ణించారు. ఇది శాంతిని సాధించడంలో విఫలమైందని, దేశంలో గందరగోళాన్ని సృష్టించిందని పేర్కొన్నారు.