అఫ్గానిస్థాన్ నంగర్హర్ జలాలబాద్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానిక మసీదులో ప్రార్థనలు చేస్తున్న ఒకే కుటుంబంలోని ఎనిమిది మందిని కాల్చి చంపారు దుండగులు.
ప్రాథమిక నివేదిక ప్రకారం హాజీ అబ్దుల్ వహాబ్.. ఐదుగురు కుమారులు, ముగ్గరు మేనల్లుళ్లు ఈ ఘటనలో మరణించినట్లు గుర్తించామని నంగర్హర్ గవర్నర్ జియా ఉల్ హక్ తెలిపారు. వ్యక్తిగత వివాదాలవల్లే.. దుండగులు వీరిపై కాల్పులు జరిపినట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు.