అఫ్గాన్ రాజధాని కాబుల్లో శనివారం మూడు వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం ఐదుగురు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
సైనిక వాహనాన్ని లక్ష్యంగా 15నిమిషాల వ్యవధిలో తొలి రెండు దాడులు జరిగాయి. ఇందులో ఇద్దరు జవాన్లతో సహా.. ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. మరో రెండు గంటల తర్వాత పోలీసు వాహనం లక్ష్యంగా జరిగిన మూడో దాడిలో ఇద్దరు రక్షక భటులు మృతిచెందారని కాబుల్ పోలీసు ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో మరో పౌరుడు గాయపడినట్టు చెప్పారు.
ఈ ఘటనకు ఎవరూ తక్షణ బాధ్యత వహించలేదు. పేలుళ్లకు కారణమేంటనేది కూడా స్పష్టంగా తెలియరాలేదు. అయితే.. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అనుబంధ సంస్థ.. వీటిలో కొన్నింటికి బాధ్యత వహిస్తున్నట్టు వెల్లడించారు. తాలిబన్లే ఈ ఘటనకు కారణమని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.