తెలంగాణ

telangana

ETV Bharat / international

మహిళల బలవంతపు పెళ్లిళ్లపై తాలిబన్ల కీలక నిర్ణయం - బలవంతపు పెళ్లిళ్లపై తాలిబన్లు

Taliban on women marriage: మహిళల బలవంతపు పెళ్లిళ్లపై నిషేధం విధిస్తున్నట్లు అఫ్గాన్​లో​ అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు ప్రకటించారు. వివాహానికి మహిళ అనుమతి తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అతివను ఆస్తిగా పరిగణించకూడదంటూ కూడా పేర్కొన్నారు.

Taliban on women marriage, afghanistan taliban, taliban women wedding
అఫ్గాన్​లో మహిళల పెళ్లిళ్లు

By

Published : Dec 4, 2021, 7:26 AM IST

Updated : Dec 4, 2021, 7:33 AM IST

Taliban on women marriage: మహిళలపై తీవ్ర వివక్ష చూపే తాలిబన్లు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాహానికి మహిళ అనుమతి తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. బలవంతపు పెళ్ళిళ్లు నిషేధించారు. పురుషులు, మహిళలు సమానమని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. అతివను ఆస్తిగా పరిగణించకూడదంటూ కూడా పేర్కొన్నారు. తాలిబన్‌ అధిపతి హిబతుల్లా అఖుంద్‌జా పేరుతో ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి.

ఒత్తిడి పెరగడం వల్లేనా?

Women in afghanistan: మహిళలపై తీవ్రమైన వేధింపులు, అణచివేతకు పాల్పడిన చరిత్ర తాలిబన్లకు ఉంది. ఇటీవల అఫ్గాన్‌లో అధికారం చేజిక్కించుకున్న తర్వాత కూడా వారి వైఖరిలో మార్పు లేదు. అయితే ఒకవైపు అంతర్జాతీయ ఒత్తిడి పెరగడం వల్లే మహిళల విషయంలో తాలిబన్‌ ఉదార వైఖరి ప్రదర్శించిందని విశ్లేషకులు అంటున్నారు. అయితే తాజా ఉత్తర్వుల్లో కనీస వివాహ వయసును పేర్కొనలేదు. గతంలో ఇది 16 ఏళ్లుగా ఉండేది. పేదరికం, పిడి సంప్రదాయవాదం వేళ్లూనుకున్న ఆఫ్గాన్‌లో బలవంతపు పెళ్లిళ్లు సర్వసాధారణంగా మారాయి. ఆడపిల్లల్ని అమ్ముకోవడం, అప్పు కింద చెల్లించడం, సంధి కోసం పణంగా పెట్టడం వంటివి సంప్రదాయంగా చలామణి అవుతున్నాయి.

Forced marriages in afghanistan: గిరిజన తెగల్లో వితంతువులైన మహిళలు.. భర్త అన్నదమ్ముల్లోనే ఒకరిని తిరిగి వివాహం చేసుకోవాలన్న నియమం ఉంది. ఇలాంటి ఆచారాలన్నింటినీ మార్చేలా తాలిబన్ల తాజా ఉత్తర్వులున్నాయి. అలాగే భర్తను కోల్పోయిన మహిళ.. 17 వారాల తర్వాత తన ఇష్టప్రకారం నచ్చిన వ్యక్తిని భర్తగా ఎంచుకొనే స్వేచ్ఛ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Dec 4, 2021, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details