తెలంగాణ

telangana

ETV Bharat / international

హెలికాఫ్టర్ నిండా డబ్బుతో అఫ్గాన్​ను వీడిన​ ఘనీ! - నగదుతో పారిపోయిన ఘనీ

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తరువాత ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ దేశాన్ని​ విడిచి వెళ్లారు. ఈ నేపథ్యంలో నాలుగు కార్లతో పాటు ఓ హెలికాప్టర్​ నిండా డబ్బుతో వెళ్లిపోయినట్టు రష్యా అధికారిక మీడియా తెలిపింది.

Ghani flees Kabul
నగదుతో పారిపోయిన ఘనీ

By

Published : Aug 16, 2021, 8:25 PM IST

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ.. దేశాన్ని​ వీడివెళ్లారు. ఈ క్రమంలో ఆయన భారీ మొత్తంలో నగదును తీసుకెళ్లినట్లు రష్యా అధికారిక మీడియా పేర్కొంది. ఒక హెలికాఫ్టర్, నాలుగు కార్లు​ నిండా డబ్బు తీసుకెళ్లినట్టు వెల్లడించింది. ఇంకా అందులో నింపేందుకు ఖాళీ లేకపోవడం వల్ల కొంత నగదును వదిలివెళ్లినట్లు చెప్పింది.

తాలిబన్లు కాబుల్​ను వారి అధీనంలో తీసుకున్న తరువాత అమెరికా మద్దతు ఉన్న ఘనీ ప్రభుత్వం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ చర్యతో విదేశీయులు, పౌరులు దేశం విడిచి పెట్టి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఘనీ హెలికాప్టర్‌ నిండా డబ్బును తనతో పాటు తీసుకుపోయినట్లు రష్యా అధికారిక వార్తా సంస్థ టాస్ నివేదించింది.

"కాబుల్​ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తరువాత ఘనీ దేశాన్ని విడిచివెళ్లారు. నాలుగు కార్లను డబ్బుతో నింపారు. అంతేగాకుండా ఇంకొక హెలికాప్టర్‌ నిండా డబ్బును తీసుకెళ్లారు. ఇంకా ఎక్కువ మొత్తం పట్టుకుపోవడానికి ప్రయత్నించారు. కానీ పట్టకపోయే సరికి ఎయిర్‌ఫీల్డ్‌లో వదిలి వెళ్లాల్సివచ్చింది.

-టాస్​, రష్యా అధికారిక వార్తా సంస్థ

ఈ సమాచారాన్ని అధ్యక్షుడి వద్ద ఉన్న ఓ ఉద్యోగి నుంచి సేకరించినట్లు టాస్​ తెలిపింది. కానీ అతని పేరును బయటపెట్టలేదు.

అప్గానిస్థాన్‌ గడ్డపై రక్తపాతాన్ని నివారించడానికే తాను దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందని అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ ప్రకటించారు. తాను ఇంకా ప్రతిఘటించి ఉంటే అనేక మంది దేశభక్తులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చేదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా తాలిబన్ల విజయాన్ని అంగీకరించిన ఆయన దేశ రక్షణ ఇక వారి బాధ్యతేనని చెప్పారు. ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్‌ అధికారిక ఖాతాలో పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

దేశాన్ని​ వీడిన అఫ్గాన్​ అధ్యక్షుడు ఘనీ!

'రక్తపాతం వద్దనే దేశం వదిలి వెళ్లా..'

ఆయనో కీలుబొమ్మ.. 'ఘనీ'చరిత్రేమీ లేదు!

ABOUT THE AUTHOR

...view details