అఫ్గానిస్థాన్‌లోని ఒక్కో రాష్ట్రాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకుంటున్న నేపథ్యంలో జాతినుద్దేశించి మాట్లాడారు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ. ప్రస్తుత పరిస్థితుల్లో... అస్థిరత, అశాంతి మరింత తీవ్రమవకుండా చూడడమే తన ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.
తాలిబన్ల దురాక్రమణపై అఫ్గాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన - అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు
అఫ్గానిస్థాన్‌లో రక్తపాతాన్ని ఆపడమే ప్రస్తుతం తన కర్తవ్యమని ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తెలిపారు. దేశంలో సుస్థిరతను నెలకొల్పే అంశంపై తాను దృష్టి సారిస్తానని చెప్పారు.

అష్రఫ్ ఘనీ
"దేశంలో ప్రజల వలసను ఆపడం, హింసను రూపుమాపడం, సుస్థిరతను నెలకొల్పడంపైనే ప్రస్తుతం దృష్టి సారిస్తానని దేశ అధ్యక్షుడిగా నేను హామీ ఇస్తున్నాను. దేశంలో మరింత రక్తపాతాన్ని జరగనివ్వను."
- అష్రఫ్ ఘనీ, అఫ్గాన్ అధ్యక్షుడు