దక్షిణ కాందహార్ స్పిన్ బోల్దాక్ ప్రాంతం లోక్మాన్ గ్రామంలో అఫ్గాన్- పాక్ బలగాలు పరస్పరం కాల్పులకు పాల్పడ్డాయి. కొన్ని గంటల పాటు జరిగిన ఈ ఘర్షణ ముగిసిందని.. కాందహార్ ఆర్మీ అధికారి యహ్యా అలవీ తెలిపారు. కాల్పుల్లో ఒక అఫ్గాన్ సైనికుడికి గాయాలైనట్లు వివరించారు. అనంతరం.. పాక్ సైన్యం అక్కడినుంచి వెనుదిరిగినట్లు పేర్కొన్నారు. ఎంతమంది పాక్ సిబ్బందికి గాయాలయ్యాయనేది తెలియాల్సి ఉందన్నారు. ఇరు దేశాల బలగాల మధ్య కాల్పులు జరగటం ఈ నెలలో ఇది రెండోసారని స్పష్టం చేశారు.
అఫ్గాన్- పాక్ బలగాల పరస్పరం కాల్పులు - అఫ్గాన్- పాక్ బలగాలు పరస్పరం కాల్పులు
అఫ్గానిస్థాన్‌లోని దక్షిణ కాందహార్ సరిహద్దులో అఫ్గాన్- పాక్ బలగాలు పరస్పరం కాల్పులకు దిగాయి. ఈ దాడిలో ఒక అఫ్గాన్ సైనికుడికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. కాల్పుల తర్వాత పాక్ బలగాలు వెనక్కి వెళ్లినట్లు కాందహార్ ఆర్మీ అధికారి యహ్యా అలవీ తెలిపారు.
![అఫ్గాన్- పాక్ బలగాల పరస్పరం కాల్పులు Afghan, Pak forces](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11562401-thumbnail-3x2-ttt.jpg)
అఫ్గాన్- పాక్ బలగాలు
అయితే.. ఈ ఘటనపై పాక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని అఫ్గానిస్థాన్ టైమ్స్ పత్రిక పేర్కొంది.
ఇదీ చదవండి :'18 ప్లస్'కు టీకా రిజిస్ట్రేషన్.. నేటినుంచే