అఫ్గానిస్థాన్లో బాంబుల మోత మోగుతోంది. తాజాగా తూర్పు లోగర్ రాష్ట్రంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు పోలీసులు, ముగ్గురు స్థానికులు ఉన్నారు. క్షతగాత్రులను స్థానికి ఆసుపత్రులకు తరలించారు.
రాష్ట్ర రాజధాని పుల్ ఈ అలామ్లోని పోలీసు తనిఖీ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ ముష్కరుడు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల్లో చాలా మంది పౌరులు ఉన్నట్లు చెప్పారు. వారిలో పోలీసు తనిఖీ కేంద్రం వద్ద నిలిచి ఉన్న కార్లలోని వారే అధికంగా ఉన్నట్లు తెలిపారు.