అఫ్గానిస్థాన్‌లోని దక్షిణ జాబుల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కందహార్, కాబుల్ మధ్య రహదారిపై ఈ ఘటన జరిగింది.
రంజాన్ సెలవుల సందర్భంగా.. దక్షిణ హెల్మాండ్ రాష్ట్రం నుంచి కార్మికులతో గురువారం బయల్దేరిన మినీవ్యాన్.. దక్షిణ జాబుల్లో ట్రక్కును ఢీకొట్టింది.