అఫ్గాన్‌లో హింస నిత్యకృత్యం అయిపోయింది. ఇవాళ జరిగిన మూడు వేర్వేరు ఘటనల్లో మొత్తం 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 9 మంది సైనికులతో పాటు 14 మంది అమాయకులు బలయ్యారు.
చెక్‌పోస్ట్‌పై దాడి
తఖార్ రాష్ట్రాం ఖ్వాజా బహుద్దీన్ జిల్లాలోని ప్రభుత్వ అనుకూల చెక్‌పోస్టులను లక్ష్యంగా చేసుకొని తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 9 మంది సైనికులు మరణించారు. మరో ఆరుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
మసీదులోకి చొరబడి
అఫ్గాన్‌లోని పర్వాన్ రాష్ట్రంలో గుర్తుతెలియని వ్యక్తులు మసీదులోకి చొరబడి కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 11 మంది అమాయకులు బలైనట్లు వెల్లడించారు. మసీదు నుంచి ప్రార్థనలు ముగించుకొని ఇంటికి వస్తున్న ఓ కుటుంబంపై దాడి చేసి.. మరో ముగ్గురిని హత్య చేసినట్లు పేర్కొన్నారు.