తెలంగాణ

telangana

ETV Bharat / international

రెండు బస్సులు ఢీ- ఏడుగురు మృతి - అఫ్గానిస్థాన్ లో ప్రమాదం

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​లో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 70మందికి పైగా గాయపడ్డారు.

buses crash
ప్రమాదం

By

Published : Apr 27, 2021, 5:39 PM IST

అఫ్గానిస్థాన్​లో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని కాబుల్​లో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 70మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలు తెలియలేదని అధికారులు తెలిపారు.

ఇదే రహదారిపై గత వారం రోడ్డు ప్రమాదం జరిగి 14మంది మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు.

ఇదీ చదవండి:కుప్పకూలిన విమానం.. నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details