అఫ్గానిస్థాన్‌లో శాంతి చర్చల పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయి. అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్లు శాంతి చర్చలకు సిద్ధమవుతున్నారు. ఖతార్ రాజధాని దోహాలో ఈ శుక్రవారం భేటీ జరగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా, నాటో బలగాలు వైదొలగుతున్న నేపథ్యంలో చర్చలు ఊరటనిచ్చే పరిణామం.
ఈ సమావేశానికి ప్రభుత్వ ఉన్నతాధికారి అబ్దుల్లా అబ్దుల్లా నాయకత్వం వహించనున్నారు. అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జయ్ కూడా సమావేశంలో పాలుపంచుకోనున్నారు. చర్చల అవకాశాన్ని చేజార్చుకోవద్దని కర్జయ్.. ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు.
మూడొంతుల ప్రాంతం ఆక్రమణ..
అఫ్గాన్‌లో ఇప్పటికే చాలా ప్రాంతాలు తాలిబన్ల అదుపులోకి వెళ్లాయి. దేశంలో దాదాపుగా మూడు వంతుల ప్రాంతాలు (421 జిల్లాలు) తాలిబన్ల అధికారంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇరాన్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్‌తో సరిహద్దును పంచుకుంటున్న వ్యూహాత్మకమైన జిల్లాలు సైతం వారి ఆధినంలో ఉన్నాయి. సైన్యం నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకుండానే చాలా ప్రాంతాలను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. దాదాపు 1000 మంది సైనికులు అఫ్గాన్ విడిచి తజకిస్థాన్‌కు పారిపోయినట్లు సమాచారం.
తాలిబన్లు సృష్టించిన హింసాత్మక ఘటనలతో భవిష్యత్‌పై ఆందోళనతో యువత ఆ దేశాన్ని వీడి వెళ్లిపోతున్నారు. అఫ్గాన్‌లో ఉన్న తమ దేశ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఫ్రాన్స్ ప్రత్యేక విమానాలను ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఆస్ట్రేలియా సైతం తమ సైనికులను అఫ్గాన్ నుంచి వెనక్కి తీసుకెళ్లింది. భారత్ కూడా తమ దౌత్య వేత్తలను స్వదేశానికి తరలించింది
ఇదీ చదవండి:అఫ్గాన్ బాధ్యతల నుంచి వైదొలిగిన అమెరికా టాప్ కమాండర్
Jacob Zuma: జుమాను జైలుపాలు చేసిన గుప్తా బ్రదర్స్!