పంజ్‌షేర్(Panjshir Valley) తిరుగుబాటు ఉద్యమ నాయకుడు అహ్మద్ మసూద్‌కు(Ahmad Massoud) సంబంధించిన వార్తలు ప్రసారం చేయొద్దని అప్ఘానిస్థాన్ మీడియాకు తాలిబన్లు(Aghan Taliban) హుకుం జారీ చేశారు. ఆయన పంపే సందేశాలు ఎక్కడా కనిపించకుండా నిషేధం విధించారు. అఫ్గాన్ ప్రజలంతా దేశ గౌరవం కోసం పోరాడాలని మసూద్ ఫేస్బుక్ వేదికగా సోమవారం పిలుపునిచ్చిన నేపథ్యంలో తాలిబన్లు ఈ ఆంక్షలు విధించారు. ఈ మేరకు రష్యా వార్తా సంస్థ స్పుత్నిక్ వెల్లడించింది. మసూద్ సారథ్యంలోని నేషననల్ రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు(National Resistance Front) చెందిన ఓ నాయకుడు ఈ విషయం తమకు చెప్పినట్లు పేర్కొంది.
అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కార్జాయ్, జాతీయ ఐక్యత ఉన్నత మండలి మాజీ ఛైర్మన్ అబ్దుల్లా అబ్దుల్లాలు ప్రజలతో మాట్లాడకుండా తాలిబన్లు(Taliban News) నియంత్రించారని కూడా స్పుత్నిక్ తెలిపింది.
భిన్న ప్రకటనలు..!
అఫ్గాన్‌లో అన్ని రాష్ట్రాలను ఆక్రమించుకున్న తాలిబన్లు పంజ్‌షేర్‌ను(Taliban Punjshir) కూడా తమ అధీనంలోకి తెచ్చుకున్నట్లు సోమవారం ప్రకటించారు. అయితే ఇది వాస్తవం కాదని తుది శ్వాసవరకు తాలిబన్లపై పోరాటం చేస్తామని పంజ్‌షేర్ తిరుగుబాటు నాయకుడు మసూద్ సోమవారం ఫేస్బుక్ వేదికగా ఆడియో సందేశం పంపారు. అఫ్గాన్ ప్రజలు ఇంటా బయటా ఎక్కడున్నా దేశ గౌరవం, స్వేచ్ఛ, సమృద్ధి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
పంజ్‌షేర్‌పై తాలిబన్లు, ఎన్ఆర్ఎఫ్ భిన్న ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రాంత తమ నియంత్రణలో వచ్చిందని తాలిబన్లు ప్రకటించగా.. మసూద్ మాత్రం ఇది అవాస్తవమని తెలిపారు. యుద్ధం ఇంకా కొనసాగుతోందన్నారు. తమ మధ్య జరిగిన భీకర పోరులో వందల మందిని హతం చేశామని ఇరు వర్గాలు ప్రకటించాయి.
ఈ ఘర్షణల్లో ఎన్ఆర్ఎఫ్(Afghanistan National Resistance Front) అధికార ప్రతినిధిని తాలిబన్లు హతమార్చగా.. వారి కీలక కమాండర్‌ను ఎన్ఆర్ఎఫ్ మట్టుబెట్టింది.
ఇదీ చదవండిTaliban Panjshir: తాలిబన్లకు ఎదురుదెబ్బ.. సీనియర్ కమాండర్ హతం