అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ బాంబు దాడులతో రక్తమోడింది. మూడు వేర్వేరు చోట్ల జరిగిన ఈ దాడుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. మరో 41 మంది గాయపడ్డారు.
యూఎస్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ మెరైన్ జనరల్ జోసెఫ్ డన్ఫోర్డ్... అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని కలవడానికి రాజధాని సందర్శిస్తున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయని అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.
దాడులు ఇలా జరిగాయ్..
తొలుత గనులశాఖ ఉద్యోగులు పయనిస్తున్న బస్సును లక్ష్యం చేసుకుని.. ద్విచక్రంవాహనంపై వచ్చిన ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. అనంతరం అంతర్జాతీయ కూటమి దళాలే లక్ష్యంగా కారు బాంబు దాడి జరిగింది.