తెలంగాణ

telangana

ETV Bharat / international

పారదర్శకంగా సంఝౌతా కేసు విచారణ: భారత్‌ - కాంగ్రెస్​ నేత

సంఝౌతా ఎక్స్​ప్రెస్​ పేలుళ్ల కేసు తీర్పుపై పాకిస్థాన్​ విమర్శలను భారత్​ తిప్పికొట్టింది. విచారణ పూర్తి పారదర్శకంగా సాగిందని తేల్చిచెప్పింది.

'సంఝౌతా' కేసు విచారణ పారదర్శకంగా జరిగిందని భారత్‌ స్పష్టీకరణ

By

Published : Mar 22, 2019, 7:36 AM IST

'సంఝౌతా' కేసు విచారణ పారదర్శకంగా జరిగిందని భారత్‌ స్పష్టీకరణ

సంఝౌతా పేలుళ్ల కేసులో నలుగురు నిందితులకు భారత న్యాయస్థానం విముక్తి కల్పించడంపై పాకిస్థాన్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పు చరిత్రలోనే అత్యంత అన్యాయపూరితమైనదని పాక్​ విదేశాంగ కార్యదర్శి తెహ్మినా జన్జువా ఆరోపించారు. బాధిత కుటుంబాల పట్ల భారత్ నిర్లక్ష్య​ వైఖరిని స్పష్టం చేస్తోందని ఆయన అన్నారు.

స్వామి అసిమానంద సహా నలుగురు నిందితులకు సంఝౌతా కేసు నుంచి విముక్తి కల్పించడంపై భారత హైకమిషనర్​ అజయ్ బిసారియాను పిలిపించి నిరసన వ్యక్తం చేశారు పాక్​ తాత్కాలిక విదేశాంగ కార్యదర్శి.

భారత్​ దీటైన సమాధానం

పాక్ విమర్శలపై స్పందించిన భారత హైకమిషనర్​... సంఝౌతా పేలుడు కేసు విచారణ పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. ముంబయి ఉగ్రదాడుల కేసులో సమగ్ర ఆధారాల్ని పాక్​కు సమర్పించామని, విచారణ త్వరితగతిన చేపట్టాలని డిమాండ్ చేశారు. పఠాన్​కోట్​ ఉగ్రదాడి కేసు దర్యాప్తులోనూ పురోగతి లేదని, పుల్వామా దాడి తర్వాత సమగ్ర వివరాలు ఇచ్చినా జైషే మహ్మద్​పై పాక్​ చర్యలు తీసుకోలేదని గుర్తుచేసినట్లు అజయ్​ బిసారియా​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details