బంగ్లాదేశ్‌లో నిన్న రాత్రి జరిగిన గ్యాస్ పైప్‌లైన్ పేలుడు సంభవించింది. మసీదులో ప్రార్థనా సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు.
నారాయణ్‌గంజ్‌లోని బైతుస్ సలాత్ జామే మసీదులో ప్రార్థనలు ముగించుకొని.. బయటకు వస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుడు వల్ల 37 మందికి తీవ్రగాయాలు కాగా.. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో 12 మంది మృత్యువాత పడినట్లు.... అధికారులు తెలిపారు.