అఫ్గానిస్థాన్‌లో తమ స్వాధీనంలోకి రాని ఏకైక ప్రాంతం 'పంజ్‌షేర్'(Panjshir Valley) ఆక్రమణ కోసం తాలిబన్లు(Taliban Panjshir) చేస్తున్న యత్నాలు బెడిసికొడుతున్నాయి. పంజ్‌షేర్ ఆక్రమణకు శనివారం యత్నించిన 700 మంది తాలిబన్ ఫైటర్లను పంజ్‌షేర్ దళాలు(Panjshir resistance forces) మట్టుబెట్టాయి. ఈ మేరకు 'స్పుత్నిక్' మీడియా తన కథనంలో పేర్కొంది. ఇదే విషయాన్ని పంజ్‌షేర్ తిరుగుబాటు దళ ప్రతినిధి ఫహీమ్ దాష్ఠి ట్విట్టర్ వేదికగా తెలిపారని చెప్పింది.
"శనివారం ఉదయం నుంచి పంజ్‌షేర్‌లోని వివిధ జిల్లాల్లో 700 మంది తాలిబన్లను పంజ్‌షేర్ దళాలు హతమార్చాయి. 1,000 మందికిపైగా తాలిబన్లు పంజ్‌షేర్‌ను చుట్టుముట్టారు. అఫ్గాన్‌లోని ఇతర ప్రావిన్సుల నుంచి ఆయుధాలను అందుకోవడంలో తాలిబన్లు ఇబ్బంది పడుతున్నారు."
- ఫహీమ్ దాష్ఠి, పంజ్‌షేర్ తిరుగుబాటు దళ ప్రతినిధి.
మరోవైపు.. పంజ్‌షేర్(Panjshir Valley) బలగాలు మందుపాతరలను ఏర్పాటు చేయడం కారణంగా వారిని తాలిబన్లు ఎదుర్కోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. పంజ్‌షేర్‌లో ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉందని తాలిబన్ వర్గాలు తెలిపాయి. పంజ్‌షేర్ రాజధాని బజారక్, గవర్నర్ కార్యాలయం ప్రాంగణంలో మందుపాతరలు అమర్చినందున ఈ ప్రక్రియ నెమ్మదించిందని పేర్కొన్నాయి. ఈ మేరకు 'ఆల్ జజీరా' తన కథనంలో పేర్కొంది.
అఫ్గానిస్థాన్‌ను మొత్తం ఆక్రమించినా.. పంజ్‌షేర్ లోయ ప్రాంతం(Panjshir Valley) మాత్రం ఇంకా తాలిబన్ల చేతికి చిక్కలేదు. దిగ్గజ మిలటరీ కమాండర్ అహ్మద్ షా మసూద్ (Ahmed Shah Masood) తనయుడు, అక్కడి నాయకుడు అహ్మద్ మసూద్ (Ahmad Massoud), అఫ్గాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఎదురు తిరగడమే కారణం. అహ్మద్ మసూద్ నేతృత్వంలోని పంజ్‌షేర్ తిరుగుబాటు దళం.. తాలిబన్లపై యుద్ధానికి సిద్ధం అని ఎప్పుడో ప్రకటించింది. వారిపై దాడి చేయడానికి వెళ్లిన తాలిబన్లను వందలాది మందిని మట్టుబెట్టినట్లు పేర్కొంది.
ఇవీ చూడండి: