తాలిబన్ల కబంధ హస్తాల్లో(Afghan Taliban) చిక్కుకున్న అఫ్గానిస్థాన్ ప్రజలు అల్లాడిపోతున్నారు. వారి అరాచకాలను భరించలేక నరకం అనుభవిస్తున్నారు. తాము చెప్పిన విధంగా ఆహారం రుచిగా వండలేదనే కారణంతో ఓ మహిళ ఒంటికి తాలిబన్లు నిప్పంటించారని అఫ్గాన్ మాజీ జడ్జి నజ్లా అయుబి తెలిపారు. మంగళవారం జరిగిన ఈ ఘటన గురించి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు.
జిహాదీలను పెళ్లి చేసుకోవాలని అఫ్గాన్ యువతులను తాలిబన్లు బలవంతం((Afghan Taliban Crisis) చేసి వేధిస్తున్నారని నజ్లా తెలిపారు. మహిళలను శవపేటికల్లో బంధించి ఇతర దేశాలకు తరలిస్తున్నారని, అక్కడ వారిని సెక్స్ బానిసలుగా మారస్తున్నారనే భయానక విషయాలను చెప్పారు.
అధికారం చేపట్టిన ఐదు రోజుల్లోనే తాలిబన్ల పాలన ఎంత దారుణంగా ఉంటుందో ప్రపంచానికి తెలుస్తోంది. కాబుల్‌లో అడుగడుగునా తుపాకులతో మోహరించిన వారు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. జాతీయ జెండా పట్టుకున్న ప్రజలను చితకబాదుతున్నారు. రోడ్డుపైకి వచ్చిన యువకులపై దాడి చేస్తున్నారు. మహిళలను వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగే అరాచకాలను నజ్లా వివరించారు.
అధికారం చేపట్టాక ప్రతీకార దాడులకు దిగబోమని, మహిళా హక్కులకు భంగం కలిగించబోమని తాలిబన్ల అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ మంగళవారం హామీ ఇచ్చారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. దేశవ్యాప్తంగా తాలిబన్లు భయానక చర్యలకు పాల్పడుతున్నారు.
ఊచకోత..