తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా ఎఫెక్ట్​: చైనాకు డబ్ల్యూహెచ్​ఓ నిపుణుల బృందం! - కరోనా వైరస్

చైనాను వణికిస్తున్న కరోనా వైరస్​ వ్యాప్తిపై అధ్యయనం చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో నిపుణుల బృందం ఆ దేశానికి వెళ్లనుంది. చైనా అధ్యక్షుడు జిన్​పింగ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) చీఫ్​ మధ్య జరిగిన ఒప్పందం మేరకు నిపుణులను చైనాకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.

A WHO-led international team of experts could go to China to investigate the coronavirus outbreak
కరోనా ఎఫెక్ట్​: చైనాకు డబ్ల్యూహెచ్​ఓ నిపుణుల బృందం!

By

Published : Feb 4, 2020, 5:52 AM IST

Updated : Feb 29, 2020, 2:22 AM IST

కరోనా ఎఫెక్ట్​: చైనాకు డబ్ల్యూహెచ్​ఓ నిపుణుల బృందం!

చైనాలో కరోనా వైరస్ అంతకంతకూ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అంచనా వేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిద్ధమైంది. వివిధ దేశాలకు చేందిన అంతర్జాతీయ నిపుణులతో కూడిన బృందాన్ని చైనాకు పంపించనుంది.

వైరస్ వ్యాప్తిపై పరిశోధన చేసేందుకు రెండు మూడు రోజుల్లో.. నిపుణుల బృందం చైనాలో పర్యటించనుంది. ఇందులో అమెరికాకు చెందిన నిపుణులు ఉన్నట్లు డబ్ల్యూహెచ్​ఓ ప్రతినిధి తెలిపారు.

ఒప్పంద మేరకు..

చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్, డబ్ల్యూహెచ్​ఓ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం నిపుణులు చైనాకు వెళ్లనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి తెలిపారు.

Last Updated : Feb 29, 2020, 2:22 AM IST

ABOUT THE AUTHOR

...view details