ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది కీలకంగా మారింది. ఇది చైనాలోని వుహాన్లో పుట్టుకొచ్చినట్లు పరిశోధకులు చెబుతున్నా.. అది అంతరిక్షం నుంచి వచ్చి ఉండొచ్చని ఓ సిద్ధాంతం పేర్కొంటోంది. అంతరిక్ష శిల లేదా ఉల్క ద్వారా భూమిని చేరి ఉంటుందని సూత్రీకరిస్తోంది.
కరోనా వైరస్ మూలాలను కనుగొనేందుకు పరిశోధకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వుహాన్లో జీవ పరిశోధనశాలలో దీన్ని అభివద్ధి చేశారని కొందరు చెబుతుండగా.. మరికొందరేమో అది గబ్బిలాల ద్వారా వచ్చిందని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎడ్వర్డ్ జె స్టీల్, ఎన్ చంద్ర విక్రమసింఘే నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఒక వినూత్న సిద్ధాంతాన్ని తెచ్చింది. క్యాండిడా ఆరిస్ కారణంగా తలెత్తిన ఫంగల్ వ్యాధి, ప్రస్తుత కొవిడ్-19 మహమ్మారిపై వీరు దృష్టి సారించారు.