అఫ్గానిస్థాన్ ఘజినీ రాష్ట్రం డే యేక్ జిల్లాలో ప్రయాణికుల విమానం కుప్పకూలింది. తాలిబన్ల అధీనంలోని ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.10కి ఈ ప్రమాదం జరిగింది.
అఫ్గానిస్థాన్‌లో విమాన ప్రమాదం- పలువురు మృతి! - అఫ్గానిస్థాన్‌లో విమాన ప్రమాదం- పలువురు మృతి!
అఫ్గానిస్థాన్‌లోని ఘజినీ రాష్ట్రంలో ఓ విమానం కుప్పకూలింది. ప్రయాణికుల పరిస్థితిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
అఫ్గానిస్థాన్‌లో విమాన ప్రమాదం- పలువురు మృతి!
విమానం అరియానా ఎయిర్‌లైన్స్‌కు చెందినది. కూలిన వెంటనే మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాద సమయంలో విమానంలో ఎంత మంది ఉన్నారు, ప్రస్తుతం వారి పరిస్థితి ఏంటన్నదానిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
Last Updated : Feb 28, 2020, 3:58 AM IST
TAGGED:
plane crash latest news