తెలంగాణ

telangana

ETV Bharat / international

US submarine: అమెరికా జలాంతర్గామికి ప్రమాదం.. చైనాకు అవకాశం..! - సీవుల్ఫ్​ జలాంతర్గామికి ప్రమాదం

అమెరికాకు చెందిన అణుశక్తి జలాంతర్గామి(Seawolf submarine) దక్షిణ చైనా సముద్ర గర్భంలో ప్రమాదానికి గురైంది. అణుధార్మికత(nuclear powered submarine ) సముద్రంలో ఏమైనా వ్యాపించిందా..? ఎంతమందికి గాయాలయ్యయో వివరాలు మాత్రం కచ్చితంగా బయటకు రాలేదు.  అయితే ఇప్పటి వరకు ఎవరూ గాయపడలేదని అమెరికా నావికాదళం ప్రకటించింది.

United States Navy
అమెరికా 'సీవుల్ఫ్‌'కు ప్రమాదం

By

Published : Oct 8, 2021, 1:25 PM IST

తైవాన్‌ జలసంధిలో(south china sea news) గత సోమవారం ఉద్రిక్తలు రాజుకొన్నాయి. అదే సమయంలో యాదృచ్ఛికంగా ఓ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో అమెరికా-చైనా మధ్య పరస్పర నమ్మకం దెబ్బతినే పరిస్థితి నెలకొంది. అమెరికాకు చెందిన అణుశక్తి జలాంతర్గామి(Seawolf submarine) దక్షిణ చైనా సముద్ర గర్భంలో ప్రమాదానికి గురైంది. అణుధార్మికత సముద్రంలో(nuclear powered submarine) ఏమైనా వ్యాపించిందా..? ఎంతమందికి గాయాలయ్యయో వివరాలు మాత్రం కచ్చితంగా బయటకు రాలేదు. అయితే ఇప్పటి వరకు ఎవరూ గాయపడలేదని అమెరికా నావికాదళం ప్రకటించింది.

ఏమి జరిగింది..?

అమెరికా నావికాదళం ఉపయోగించే సీవుల్ఫ్‌ శ్రేణి(Seawolf submarine) అణుశక్తి జలాంతర్గామి యూఎస్‌ఎస్‌ కనెక్టికట్‌ (ఎస్‌ఎస్‌ఎన్‌22) దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో(south china sea news) అడుగుకు వెళ్లే సమయంలో ఏదో భారీ వస్తువును తాకింది. ఈ ఘటన అక్టోబర్‌ 2వ తేదీన చోటు చేసుకొంది. సబ్‌మెరైన్‌ సముద్రంలోకి వెళ్లినప్పుడు వెంటనే సమాచారం బయటకు రాదు. దీంతో ఈ ఘటన వెలుగులోకి రావడం ఆలస్యమైంది. ఈ ప్రమాదంలో దాదాపు 12 మంది అమెరికా సెయిలర్లకు స్వల్ప, మధ్యశ్రేణి గాయాలైనట్లు ఫోర్బ్స్‌ పత్రిక పేర్కొంది. ఎవరికీ ప్రాణహాని సంభవించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం సబ్‌మెరైన్‌ పరిస్థితి నిలకడగా ఉంది. త్వరలోనే గువామ్‌లోని నావికాదళ స్థావరానికి చేరే అవకాశం ఉంది.

అణు ప్రమాదం జరిగిందా..?

సాధారణ ప్రజలు అణుశక్తి జలాంతర్గామి(ఎస్‌ఎస్‌ఎన్‌)ని(nuclear powered submarine) అణుదాడి చేసే జలాంతర్గామి(ఎస్‌ఎస్‌బీఎన్‌)గా భావిస్తుంటారు. ఎస్‌ఎస్‌ఎన్‌ జలాంతర్గామిలో చిన్నసైజు న్యూక్లియర్‌ రియాక్టర్‌ ఉంటుంది. దీనిలోని న్యూక్లియర్‌ ఫ్యూజన్‌ సాయంతో జలాంతర్గామికి అవసరమైన శక్తిని సృష్టిస్తారు. సాధారణంగా డీజిల్‌-ఎలక్ట్రిక్‌ సబ్‌మెరైన్లలో డీజిల్‌ను మండించి.. విద్యుత్తు తయారు చేస్తారు. దీనిని బ్యాటరీల్లో నిల్వ ఉంచి సబ్‌మెరైన్‌కు వాడుకొంటారు. దీనిలో డీజిల్‌ మండించేందుకు సముద్రం ఉపరితలంపైకి తరచూ రావాల్సి ఉంటుంది. కానీ, ఎస్‌ఎస్‌ఎన్‌ అయితే సుదీర్ఘకాలం నీటి అడుగున నిశ్శబ్దంగా ఉండొచ్చు. ఇక ఎస్‌ఎస్‌బీఎన్‌లో అణుశక్తి బాలిస్టిక్‌ క్షిపణులు ఉంటాయి. వీటితో ప్రత్యర్థులపై అణ్వాయుధాలు ప్రయోగించవచ్చు. తాజాగా అమెరికాలో ప్రమాదానికి గురైన సబ్‌మెరైన్‌ ఎస్‌ఎస్‌ఎన్‌ కేటగిరికి చెందినది. దీనిలోని న్యూక్లియర్‌ ప్రొపెల్షన్‌ రియాక్టర్‌ దెబ్బతినలేదని అమెరికా అధికారులు చెబుతున్నారు. సబ్‌మెరైన్‌ నావికదళ స్థావరానికి చేరాక గానీ పూర్తివివరాలు వెల్లడికావు.

సీవుల్ఫ్‌ క్లాస్‌ సబ్‌మెరైన్లను సోవియట్‌తో కోల్డ్‌వార్‌ సమయంలో అమెరికా అభివృద్ధి చేసింది. దీనిలో భారీ ఎత్తున ఆయుధాలను ఉంచవచ్చు. దీని అత్యాధునిక సెన్సర్లు శత్రువును ముందుగానే పసిగడతాయి. ఇలాంటి సబ్‌మెరైన్‌ ప్రమాదానికి గురైతే అమెరికా నావికాదళం చాలా ఆలస్యంగా.. మిగిలిన శాఖలకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకుండా వెబ్‌సైట్లో పెట్టడం విమర్శలకు తావిస్తోంది.

అమెరికా మిత్రదేశాల యుద్ధవిన్యాసాల సమీపంలోనే..

ప్రమాదానికి గురైన యూఎస్‌ఎస్‌ కనెక్టికట్‌(nuclear powered submarine) దక్షిణ చైనా సముద్రంలో విధులు నిర్వహిస్తోంది. దీనికి సమీపంలోనే అమెరికా నేతృత్వంలో ఆరు దేశాలు యుద్ధవిన్యాసాలు చేస్తున్నాయి. దీనిలో నాలుగు విమానవాహక నౌకల క్యారియర్‌ గ్రూప్‌లు, సబ్‌మెరైన్లు పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో నిఘా కోసం వచ్చిన ఏదైనా వాహనాన్ని యూఎస్‌ఎస్‌ కనెక్టికట్‌ ఢీకొన్న విషయాన్ని కొట్టిపారేయలేమని అమెరికా అధికారులు చెబుతున్నారు. సీ వుల్ఫ్‌ శ్రేణి సబ్‌మెరైన్లు అమెరికా నావిదళంలో అత్యంత శక్తిమంతమైనవిగా పేరుతెచ్చుకొన్నాయి.

గతంలో జరగలేదా..?

గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా 2005 లాస్‌ ఏంజెల్స్‌ శ్రేణిలోని యూఎస్‌ఎస్‌ శాన్‌ ఫ్రాన్సిస్కో సబ్‌మెరైన్‌ నీటి అడుగున ఉన్న కొండవంటి ప్రదేశాన్ని ఢీకొంది. 2009 నుంచి మూడు అణ్వాయుధ ప్రయోగ సామర్థ్యం ఉన్నవి, రెండు అటాక్‌ సబ్‌మెరైన్లు ప్రమాదాలకు గురయ్యాయి. 2009లో యూఎస్‌ఎస్‌ హార్ట్‌ఫోర్డ్‌ మరో యాంఫీబియస్‌ నౌక యూఎస్‌ఎస్‌ ఓర్లాన్స్‌ను ఢీకొంది. ఈ ఘటనలో సబ్‌మెరైన్లలోని 15 మంది సెయిలర్లు గాయపడటంతోపాటు 120 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది.

అది దక్షిణ చైనా సముద్రమని గుర్తుంచుకోవాలి..

ఉద్రిక్తతలను పక్కనపెడితే.. దక్షిణ చైనా సముద్రం(south china sea news) అత్యంత కఠినమైన ప్రాంతం.. అత్యంత రద్దీగా ఉంటూ నియంత్రణ చాలా తక్కువగా ఉండే సముద్ర మార్గం. చాలా చోట్ల ఇలా చేయండి అని చెప్పడానికి కూడా ఏమీ ఉండదు. 1972లో అమెరికా అణుశక్తి జలాంతర్గామి స్కాల్పిన్‌ను వియత్నాం ట్రాలెర్‌ వెంటాడింది. చైనాలోని హైనన్‌ నుంచి నటులా ద్వీపం వరకు ఈ వేట సాగించినట్లు 'నేవల్‌ హిస్టరీ' పత్రిక పేర్కొంది.

ఈ సముద్రం అడుగున చాలా చోట్ల భారీ శిలలు, చేపల సమూహాలు, నౌకల శిథిలాలు ఎదురవుతుంటాయి. ఇక చేపల వేటగాళ్ల పడవలు, ఖాళీగా వదిలేసిన చమురు రిగ్‌లు కూడా సబ్‌మెరైన్లను భయపెడుతుంటాయి. దీంతో ఈ ప్రాంతాల్లో సబ్‌మెరైన్లు.. నీటిలో అత్యధికంగా 30 అడుగుల లోతుకు మాత్రమే వెళుతుంటాయి. దీనికి తోడు ఈ సముద్రంలో వ్యర్థాలూ ఎక్కువే. ఈ ఏడాది 3000 షిప్‌ కంటైనర్లు అక్కడ మునిగిపోయాయి.. ఇవన్నీ జలాంతర్గాముల పనిని జటిలం చేస్తున్నాయి.

చైనాకు కలిసొచ్చిన ప్రమాదం..

యూఎస్‌ఎస్‌ కనెక్టికట్‌ ప్రమాదం అమెరికా పసిఫిక్‌ వ్యూహాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో(south china sea news) ఇది కనుక పూర్తిగా దెబ్బతింటే రిపేర్‌ చేసే విషయమై అమెరికాపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఒక వేళ పూర్తిగా పక్కనపెట్టాల్సి వస్తే మాత్రం ఈ ప్రదేశంలో చైనా కట్టడి చేసే సత్తా అమెరికాకు తగ్గుతుంది. అంతేకాదు... తైవాన్‌ రక్షణ వ్యూహం నుంచి.. కొత్తగా అమెరికా-బ్రిటన్‌-ఆస్ట్రేలియా చేసుకొన్న ఆకుస్‌ ఒప్పందంపై కూడా దీని ప్రభావం పడుతుంది. ఈ సబ్‌మెరైన్‌ సైజు కొంచెం చిన్నదిగా ఉంటుంది. దీంతో శత్రువు కళ్లుగప్పి ఈ ప్రాంతాలోని మిత్ర దేశాలైన తైవాన్‌, వియత్నాం, ఫిలిప్పీన్స్‌ అత్యంత సమీపంలోకి వెళ్లి పరిస్థితిని అంచనా వేయవచ్చు. తైవాన్‌తో ఉద్రిక్త సమయంలో ఈ సబ్‌మెరైన్‌ దెబ్బతినడం చైనాకు కలిసొచ్చే అంశం.

ఇదీ చూడండి:'జలాంతర్గామిలోని 53 మంది జలసమాధి!'

ABOUT THE AUTHOR

...view details