తెలంగాణ

telangana

ETV Bharat / international

బీరుతో శానిటైజర్ల తయారీ.. ఎక్కడో తెలుసా?

కరోనా ప్రభావిత దేశాల్లో ఫిలిప్పీన్స్ ఒకటి. వైరస్​ విజృంభన నేపథ్యంలో ఆ దేశంలో శానిటైజర్ల కొరత ఏర్పడింది. దీంతో ఓ రెస్టారెంట్​ యజమాని బీరు తయారు చేసే ఆల్కహాల్​తో శానిటైజర్లను తయారు చేసి ఆస్పత్రుల్లో ఉచితంగా అందిస్తున్నాడు. సంక్షోభ సమయంలో ఇలా తన వంతు సాయం చేయటం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెబుతున్నాడు.

A micro-brewery in Manila has turned away from making craft beers and has begun producing hand sanitizer
బీరుతో శానిటైజర్లు తయారు.. ఎక్కడో తెలుసా..?

By

Published : Mar 21, 2020, 1:23 PM IST

బీరుతో శానిటైజర్ల తయారీ.. ఎక్కడో తెలుసా..?

కరోనా ప్రభావంతో ఫిలిప్పీన్స్​వ్యాప్తంగా రెస్టారెంట్లు, దుకాణాలు వెలవెలబోతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు శానిటైజర్లను వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశంలో శానిటైజర్ల కొరత ఏర్పడింది. అయితే ఓ రెస్టారెంట్ యజమాని బీరు తయారీకి ఉపయోగించే ఆల్కహాల్​తో శానిటైజర్లను తయారు చేసి ఉచితంగా అందిస్తున్నాడు.

ఫిలిప్పీన్స్​లోని రౌల్ మసాంగ్‌కే అనే వ్యక్తి తన రెస్టారెంట్​లో బీరు తయారు చేసి అమ్మేవాడు. వైరస్​ వేగంగా వ్యాపి చెందుతుండటం వల్ల ప్రజలు ఎవరూ బయటకు రావటం లేదు. ఈ నేపథ్యంలో కస్టమర్లు లేక రెస్టారెంట్​ వెలవెలబోతోంది.

ఆ సమయంలో రెస్టారెంట్​ యజమాని మసాంగ్​కు వినూత్న ఆలోచన వచ్చింది. వైరస్​ను కట్టడి చేసేందుకు బీరు తయారీకి ఉపయోగించే ఆల్కహాల్​తో శానిటైజర్లను తయారు చేయటం ప్రారంభించాడు. ఆ శానిటైజర్లను ముందుగా తన షాపుకు వచ్చే కస్టమర్లకు ఉచితంగా ఇవ్వడం మొదలు పెట్టాడు. ఆస్పత్రుల్లో శానిటైజర్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న మసాంగ్​.. తాను తయరు చేసిన శానిటైజర్లను ఉచితంగా అందిస్తున్నాడు.

దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో శానిటైజర్లను తయారు చేసి ప్రజలకు ఉచితంగా అందించటం చాలా ఆనందంగా ఉందని చెబుతున్నాడు మాసాంగ్​.

ఇదీ చూడండి:కరోనాపై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details