అతడు పబ్లిక్ లాండ్రీ షాపులకు వెళ్తాడు... తన చేతికి పని చెప్తాడు... అక్కడ ఖరీదైన బట్టలు ఎన్ని ఉన్నా పట్టించుకోడు... అతడి కన్ను పడేది అండర్వేర్లపైనే! నేరుగా వాటి కోసం వెతుకుతాడు- అదీ అమ్మాయిలవేనండోయ్! ఇక అంతే.. లేపేసి చెక్కేయడమే!
జపాన్లో టెట్సువో ఉరాట (Tetsuo Urata) అనే 56 ఏళ్ల వ్యక్తి చేసే ఘనకార్యం ఇది. ఇప్పటివరకు 730 పీసుల మహిళల లోదుస్తులను (stealing underwear) అతడు దొంగలించాడు. ఓ 21 ఏళ్ల యువతి ఇచ్చిన పోలీస్ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకొని ఉరాట ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు.. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి నోరెళ్లబెట్టారు. నిందితుడి ఇంట్లో అన్నీ అండర్వేర్లే మరి!
'అన్ని లోదుస్తులను మేం ఇంతవరకు సీజ్ చేయలేదు' అని పోలీసులే విస్మయంతో చెప్పుకొచ్చారు. అయితే, ఇన్ని అండర్వేర్లు ఎందుకోసం దొంగతనం చేశాడన్నది మాత్రం తెలియలేదు. నిందితుడిని(underwear stealer) అరెస్టు చేసిన పోలీసులు దీనిపై మరింత విచారణ చేస్తున్నారు.