తెలంగాణ

telangana

ETV Bharat / international

వెనక్కి నడుస్తూ.. 800 కిలోమీటర్లు ఎందుకో తెలుసా?

ఇండోనేసియాకు చెందిన మేదీ బస్టోనీ అనే వ్యక్తి పాదయాత్ర చేపట్టాడు. కానీ అందరిలా చేస్తే ఏముంది అనుకున్నాడో ఏమో.. వెనక్కి నడుస్తూ సుమారు 800 కిలోమీటర్లు పూర్తి చేశాడు. ప్రకృతిని, అడవులను రక్షించడంలో ప్రజలకు చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయాణానికి శ్రీకారం చుట్టానని చెబుతున్నాడు. నెల రోజుల్లో తూర్పు జావాలోని స్వగ్రామం నుంచి దేశ రాజధాని జకార్తాకు నడిచి పాదయాత్రను ముగించాడు.

వెనక్కి నడుస్తూ.. 800 కిలోమీటర్లు ఎందుకో తెలుసా?

By

Published : Aug 25, 2019, 9:01 PM IST

Updated : Sep 28, 2019, 6:12 AM IST

వెనక్కి నడుస్తూ.. 800 కిలోమీటర్లు ఎందుకో తెలుసా?

ప్రకృతిని, అడవులను సంరక్షించాలనే సంకల్పంతో ప్రజలకు చైతన్యం కలిగించాలనుకున్నాడు ఇండోనేసియాకు చెందిన మేదీ బస్టోనీ. అందుకు వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. అందరిలా కాకుండా వెనక్కి నడవాలనుకున్నాడు. ఆలోచన రావడమే ఆలస్యం పాదయాత్రను ప్రారంభించి నెలరొజుల్లో సుమారు 800 కిలోమీటర్లు నడిచి చూపించాడు.

బస్టోనీ సంకల్పానికి ఆసక్తి కనబరిచిన కొందరు వాలంటీర్లు, అంబులెన్సుతో సహా అతనికి సాయంగా నిలిచారు. మరి కొందరు ఇంట్లో నిద్రపోవడానికి వీలు కల్పించారు. మసీదులు, పోలీసు స్టేషన్​లలో కూడా రాత్రిపూట సేద తీరేవారు బస్టోనీ. ఆయన ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నాడు.

ప్రజల్లో చైతన్యం కలిగించడానికే ఇలా వెనక్కి నడుస్తున్నాను. అడవుల అభివృద్ధికి సాయం చేయాలని అధ్యక్షుడిని కోరుతున్నా.. అన్ని వర్గాలు కలిసి ఈ కార్యక్రమానికి తోడ్పడాలి.

-మేదీ బస్టోనీ, ఇండోనేసియా ప్రయాణికుడు

క్రీడామంత్రికి వినతి పత్రం...

స్వగ్రామం డోనో నుంచి కుటుంబం, స్నేహితుల సాయంతో రూ. 30వేల రూపాయలతో ప్రయాణాన్ని ప్రారంభించాడు బస్టోనీ. నడక ముగిసిన తరువాత క్రీడా, యువజన శాఖ మంత్రి ఇమామ్​ నహ్రావిని కలిసి తూర్పు జావా ప్రాంతంలో అంతరించిపోతున్న అడవులను పరిరక్షించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. అటవీ నిర్మూలన కారణంగా నీటి కొరత ఏర్పడుతుందని, మానవ మనుగడకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. అందుకే..అడవులను పరిరక్షించాలని బస్టోని పిలుపునిచ్చాడు.

ఇదీ చూడండి:అమెరికా: హైవేపై దిగిన బుల్లి విమానం

Last Updated : Sep 28, 2019, 6:12 AM IST

ABOUT THE AUTHOR

...view details