తెలంగాణ

telangana

ETV Bharat / international

పిల్లిని చంపిన కిరాతకుడికి 34 నెలల జైలు - malaysian man who killed cat, sentencened jail in kaulalampur

గర్భందాల్చిన పిల్లిని చంపినందుకు మలేషియాలో ఓ వ్యక్తికి 34 నెలల జైలు శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. పిల్లిని ఓ లాండ్రీ డ్రయర్​లో పడేసి కడతేర్చిన దృశ్యాలు వైరల్​గా మారాయి. ఈ ఘటనపై జంతు ప్రేమికులు సహా అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది.

పిల్లిని చంపిన వ్యక్తికి 34 నెలల జైలు శిక్ష

By

Published : Nov 7, 2019, 7:51 AM IST

మలేషియాలో గణేష్​ అనే వ్యక్తి పిల్లిని చంపి జైలుకెళ్లాడు. గర్భం దాల్చిన పిల్లిని కౌలాలంపుర్​లోని ఓ పబ్లిక్​ లాండ్రీ డ్రయర్​లో పడేసి హత్య చేసినట్లు న్యాయస్థానం నిర్ధరించింది. జంతు సంరక్షణ చట్టాన్ని అతిక్రమించినందున గణేష్​కు 34 నెలల శిక్షతో పాటు 40 వేల రింగెట్స్​(మలేషియా కరెన్సీ)ను జరిమానాగా విధించింది. అతను అప్పీలు చేసుకోవడానికి వీలుగా బెయిల్​పై విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదే కేసులో ఓ ట్యాక్సీ డ్రైవర్​కు జనవరిలోనే రెండేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.

42 ఏళ్ల గణేశ్​, ఓ ట్యాక్సీ డ్రైవర్​ కలిసి గతేడాది సెప్టెంబర్​లో దుస్తులు ఆరబట్టే యంత్రంలో పిల్లిని పడేయడం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్​ కాగా... జంతు ప్రేమికులతో పాటు అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details