తైవాన్‌లోని 'ఎక్స్పార్క్ కోజీ బ్లూ' హోటల్.. ప్రపంచంలోని ప్రత్యేక నిర్మాణాల్లో ఒకటి. సముద్ర వాతావరణాన్ని తలపించే ఈ హోటల్లో అక్వేరియం పెద్ద ఆకర్షణ. రకరకాలైన సముద్ర జీవులు గాజుగదుల్లో తిరుగుతూ అతిథులకు స్వాగతం పలుకుతాయి.
పెంగ్విన్ల ఆటలు..
హోటల్ ప్రవేశద్వారం నుంచే సముద్ర జీవులు దర్శనమిస్తాయి. రకరకాల చేపలు, పెంగ్విన్లు ఒక చోట నుంచి మరొక చోటుకు తిరుగుతూ కనువిందు చేస్తాయి. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పెంగ్విన్ల ఆటలు. సాధారణంగా మంచు ప్రాంతాల్లో కనిపించే పెంగ్విన్లు.. ఈ అక్వేరియం నీటిలో సరదాగా ఆడుకుంటూ చూపరుల మనసు దోచేస్తాయి. అందుకే వీక్షకులు ఈ హోటల్‌కు వెళ్లేందుకు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. మరి విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ జంతువులను కంటికిరెప్పలా చూసుకుంటూ.. వాటి పరిరక్షణకూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్వాహకులు.
ఇలాంటి హోటల్ చూడటం ఇదే మొదటిసారి. అక్వేరియంలో పెంగ్విన్‌లు ఈత కొట్టడం చూస్తుంటే ఆనందంగా ఉంది. నిజంగా ఈ హోటన్ చాలా ప్రత్యేకమైంది. ఈ పర్యటనను చాలా ఎంజాయ్ చేశాను.
-- చు, పర్యటకురాలు
నవల ఆధారంగా నిర్మాణం..
ఈ హోటల్‌ను ఫ్రెంచ్ నవల 'ట్వంటీ థౌజెండ్ లీగ్స్ అండర్ ది సీ' ఆధారంగా నిర్మించారు. నవలలో ఉండే ప్రత్యేక అంశాలను ఆసరాగా చేసుకొని దీనికి రూపకల్పన చేశారు. హోటల్లోని ప్రతీ గదిని.. ఆ పుస్తకంలో పొందుపర్చిన కొలతలకు తగ్గట్టుగానే నిర్మించారు. గోడల మీద ఉండే కళాఖండాలు కూడా సముద్రానికి సంబంధించినవే ఉంటాయి.
'ట్వంటీ థౌజెండ్ లీగ్స్ అండర్ ది సీ' అనే ఫ్రెంచ్ నవల ఆధారంగా హోటల్ రూపొందించాం. హోటల్ ప్రతి మూలను సముద్రంతో సంబంధం ఉన్న వాటితోనే అలంకరించాం. బెడ్‌రూమ్‌లలో 65 అంగుళాల టీవీ స్క్రీన్ ఉంటుంది. అందులో సొరచేపలు, మాంటారేస్లు సరదాగా తిరగుతూ ఉండడం లైవ్‌లో చూడొచ్చు.