అఫ్గానిస్థాన్‌లో కారుబాంబు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో పలువురు చిన్నారులు సహా 23మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ అఫ్గాన్‌లోని హెల్మాండ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటనపై ఆ ప్రాంత గవర్నర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
తాలిబన్లు- సైన్యం పరస్పర విమర్శలు
ఘటనకు బాధ్యత మీదంటే.. మీదేనంటూ తాలిబన్లు, అఫ్గాన్ సైన్యం పరస్పర విమర్శలు చేసుకున్నాయి. సైన్యమే మార్కెట్ లక్ష్యంగా మోర్టార్ షెల్లను ప్రయోగించిందని తాలిబన్లు ప్రకటించింది. సాధారణ పౌరులు లక్ష్యంగా తాలిబన్లు కారుబాంబు పేల్చారని ఆరోపించింది సైన్యం.