భారత దేశంలోని పట్టణాల్లో నివసించేవారిలో సుమారు 9కోట్ల మందికి.. ఇళ్లల్లో చేతులు శుభ్రపరుచుకునేందుకు కనీస సౌకర్యాలు లేవని యూనిసెఫ్ పేర్కొంది. ఈ మేరకు 'అంతర్జాతీయ హ్యాండ్ వాష్ డే' సందర్భంగా.. విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. కరోనా వేళ ఈ సమస్య మరింత పెరిగిందని తెలిపింది.
22శాతం మందికి..
మధ్య, దక్షిణ ఆసియా పట్టణాల్లో నివసించే 22శాతం మంది ప్రజలకు చేతులు కడుక్కునేందుకు సబ్బు, నీరు వంటి సదుపాయాలు అందుబాటులో లేవని యూనిసెఫ్ నివేదిక స్పష్టం చేసింది. బంగ్లాదేశ్లో సుమారు 2కోట్ల 90లక్షల మంది పట్టణ ప్రజలు కూడా ఈ సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రకటించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రపరుచుకోవటం గుర్తుంచుకోవాలని, ఇది సామాజిక బాధ్యతని యూనెసెఫ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ యాస్మిన్ ఆలీ హక్ అన్నారు. లేని పక్షంలో కొవిడ్ మరింత విజృంభిస్తుందని ఆయన హెచ్చరించారు. తరచూ చేతులు శుభ్రపరచుకోవడం ద్వారా కరోనాలాంటి మరెన్ని వైరస్లను అడ్డుకోవచ్చని గుర్తుచేశారు యాస్మిన్.