వియత్నాంలో గడిచిన రెండు వారాలుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. క్వాంగ్ త్రీ, తువా థియాన్హ్యూ, క్వాంగ్నామ్ రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడి 90 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 34మంది గల్లంతయ్యారు.
లక్షమందికి పైగా ప్రభావితం..
వరద ప్రభావిత ప్రాంతాల్లోని 37,500 ఇళ్లల్లో లక్షా 21 వేల మందికిపైగా ఖాళీ చేయించారు అక్కడి విపత్తు నిర్వహణ అధికారులు. మౌలిక సదుపాయలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయి.. కొన్ని ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి.