అఫ్గానిస్థాన్ మైదాన్ వర్దాగ్ రాష్ట్రం బేహ్సుద్ జిల్లాలో ప్రత్యేక దళాల హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో 9 మంది మృతిచెందారు.
బుధవారం రాత్రి ఎమ్ఐ-17 హెలికాప్టర్ కూలినట్లు అఫ్గాన్ రక్షణ శాఖ స్పష్టం చేసింది. మృతుల్లో ఐదుగురు అధికారులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు పేర్కొంది.
బస్సుపై దాడి-ముగ్గురు మృతి
కాబూల్లో ఐటీ శాఖలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణిస్తోన్న బస్సుపై జరిగిన బాంబు దాడిలో ముగ్గురు మృతిచెందారు. 11 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. సరీ కోటల్ ప్రాంతంలో గురువారం ఉదయం 7.30 గంటలకు ఈ ఘటన జరిగిందని అధికారులు స్పష్టం చేశారు.
సోమవారం కూడా ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణిస్తోన్న బస్సుపై దాడి జరిగిందని, ఆ ఘటనలో ఐదుగురు మృతిచెందారని స్థానిక మీడియా వెల్లడించింది.
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ప్రక్రియ మే నెలతో ముగియనున్న నేపథ్యంలో ఉద్యోగులపై దాడులు పెరుగుతున్నాయి. గత 18 రోజుల్లో జరిగిన దాడుల్లో 144 మంది మృతిచెందగా 214 మంది గాయాలపాలయ్యారని స్థానిక మీడియా పేర్కొంది.
ఇదీ చదవండి:మానవ హక్కులపై అమెరికాను ఎండగట్టిన చైనా!