నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పశ్చిమ నేపాల్లోని బైఠాడి జిల్లాలో కొడ్పెలోని దశరథ్ చాంద్ రహదారిపై అదుపు తప్పిన బస్సు.. లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. మరో 34 మందికి గాయాలయ్యాయి.
మహేంద్రనగర్ నుంచి ఘన్నా వెళుతుండగా గురువారం రాత్రి 11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 8 గంటలకు సహాయకచర్యలు మొదలుపెట్టారు. ఇప్పటివరకు 8 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.