తెలంగాణ

telangana

ETV Bharat / international

అప్గాన్​లో బాంబు దాడులు- 9 మంది మృతి - తాలిబన్లు

అఫ్గానిస్థాన్ మరోమారు బాంబు దాడులతో దద్దరిల్లింది. ఉత్తర ఫర్యాద్​, తూర్పు కోస్ట్ రాష్ట్రాలలో జరిగిన పేలుళ్లలో 9 మంది మృతి చెందారు. మరో 16 మంది గాయపడ్డారు. మృతులలో ఇద్దరు సైనికులు ఉన్నారు.

Afgan
అఫ్గాన్​

By

Published : Dec 22, 2020, 9:31 PM IST

అఫ్గానిస్థాన్​లో జరిగిన రెండు వేర్వేరు బాంబుదాడులలో 9 మంది మృతి చెందారు. 16 మంది గాయపడ్దారు. మృతులలో ఇద్దరు సైనికుల ఉన్నారు. ఉత్తర ఫర్యాద్​, తూర్పు కోస్ట్ రాష్ట్రంలో తాలిబన్లు బాంబు దాడులకు తెగబడ్డారని పోలీసులు తెలిపారు.

ఉత్తర ఫర్యాద్​లోని దవలత్​ అబాద్​ జిల్లాలో జరిగిన బాంబు దాడిలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. 10 మందికి పైగా గాయపడ్డారు. కోస్టా లోని యాకుబీ జిల్లాలో సైనికవాహనాల్ని లక్ష్యంగా చేసుకొని తాలిబన్లు బాంబులు విసిరారు. ఆ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. అందులో నలుగురు పౌరులు ఉన్నారు.

అయితే ఫర్వాన్​ రాష్ట్రంలో ఓ దుకాణం విషయమై యజమానుల మధ్య గొడవలు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. కాబుల్ సహా నాలుగు రాష్ట్రాలు కుంద్​, కోస్ట్​, ఫర్యాద్​లో బాంబు దాడులు జరిగాయి. ఈ ఘటనలపై ఇంత వరకు తాలిబన్లు స్పందించలేదు.

ఇదీ చూడండి:శాంతి చర్చలకు తూట్లు.. అఫ్గాన్​ సైన్యంపై తాలిబన్ల దాడి!

ABOUT THE AUTHOR

...view details