అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆక్రమణను నిలువరించేందుకు దాడులు ప్రారంభించింది ఆ దేశ సైన్యం. ఇందులో భాగంగా హెల్మాండ్ ప్రావిన్స్‌లో జరిపిన వైమానిక దాడుల్లో 77 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్లు ఆ దేశ రక్షణ సహాయ మంత్రి ఫవేద్ అమెన్.. మంగళవారం వెల్లడించారు. వీరిలో ముగ్గురు కీలక నేతలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. మరో 22 మంది గాయపడ్డారని తెలిపారు.
వైమానిక దాడుల్లో 77 మంది తాలిబన్లు హతం - తాలిబన్ల హతం
అఫ్గాన్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 77 మంది తాలిబన్లు హతమైనట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రతినిది పవేద్ అమెన్ ప్రకటించారు. వారిలో ముగ్గురు కీలక నేతలున్నట్లు తెలిపారు. మరో 22 మంది గాయపడినట్లు పేర్కొన్నారు.

వైమానిక దాడులు
అంతకుముందు హెల్మాండ్‌లోని లష్కారహ్ నగరంలో అమెరికా జరిపిన వైమానిక దాడిలో 40 మంది తాలిబన్లు హతమైనట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:రాకెట్ దాడిలో 200 మంది తాలిబన్లు హతం