అఫ్గానిస్థాన్‌లో 75శాతం మంది బాలికలు తిరిగి పాఠశాలలకు హాజరవుతున్నారని(afghan girls education ) తాలిబన్లు తెలిపారు. అఫ్గాన్‌లో బాలికల విద్యా హక్కుల పరిస్థితిపై పాకిస్థాన్ వార్తా సంస్థ డాన్ అడిగిన ఓ ప్రశ్నకు అఫ్గాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ మట్టాఖి ఈ మేరకు బదులిచ్చారు.
ఈ ఏడాది ఆగస్టులో అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు(afghan taliban ) పాఠశాలలను మూసివేశారు. దీంతో వేలాది మంది బాలికలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. అధికారం చేపట్టాక తాము మహిళల హక్కులు, వారి విద్యా హక్కులకు(afghanistan girls education) ఎలాంటి భంగం కలిగించబోమని తాలిబన్లు చెప్పినప్పటికీ.. ఇంతకాలం వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉండేవి. మహిళలు, బాలికల పట్ల వారు కఠినంగా వ్యవహరిస్తున్నారు. చదువుకోకుండా, పనులకు వెళ్లకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అఫ్గాన్‌లోని అన్ని ఉన్నత పాఠశాలలను ఇటీవలే తిరిగి ప్రారంభించింది విద్యాశాఖ. అయితే ఇది బాలురకేనని ఆదేశాల్లో పేర్కొంది. బాలికల(afghanistan women news) ప్రస్తావన ఎక్కడా లేదు.