అఫ్గానిస్థాన్లో కొద్ది రోజులుగా తాలిబన్లు చేస్తోన్న దాడులకు ప్రతిస్పందనగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి భద్రత దళాలు. గత నెల రోజుల్లో హెల్మండ్, కందహార్ రాష్ట్రాల్లో బలగాలు చేపట్టిన దాడుల్లో మొత్తం 70 మంది తాలిబన్ కమాండర్లు హతమయ్యారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.
ఈ ఆపరేషన్లో భాగంగా హెల్మండ్ రాష్ట్రంలో మరో 152 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తరీక్ అరియన్. బలగాల కాల్పుల్లో హతమైన తాలిబన్లలో 20 మంది హెల్మండ్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిగా పేర్కొన్నారు.
" కందహార్లో హతమైన తాలిబన్ కమాండర్లలో 10 మంది ఉరుజ్గాన్, కందహార్, ఘజ్నీ నుంచి వచ్చారు. కందహార్లో మొత్తం 40 మంది కమాండ్లరు హతమయ్యారు. హెల్మండ్ దాడుల్లో సుమారు 30 మంది తాలిబన్ కమాండర్లు గాయపడ్డారు. "