తెలంగాణ

telangana

ETV Bharat / international

ఈ వారంలో 7.5 లక్షలకు కరోనా మరణాలు! - corona virus death toll

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు అన్ని దేశాల్లో కలిపి 2 కోట్ల 7 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా ధాటికి 7.34 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వారంలో కరోనా మరణాలు 7.5 లక్షలకు చేరవవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.

CORONA WORLD
కరోనా మహమ్మారి

By

Published : Aug 10, 2020, 7:49 PM IST

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2.07 కోట్ల మందికి వైరస్ సోకింది. ఇప్పటివరకు 7.34 లక్షల మంది చనిపోగా.. 1.29 కోట్ల మంది కోలుకున్నారు.

నేపాల్​లో..

నేపాల్​లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 338 మంది వైరస్ బారిన పడగా మొత్తం సంఖ్య 23,310కి చేరింది. ఇప్పటివరకు ఈ దేశంలో 79 మంది మరణించారు. అయితే ఇందులో 16,493 మంది కోలుకున్నట్లు నేపాల్ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ జగేశ్వర్ గౌతమ్​ వెల్లడించారు.

ఫిలిప్పీన్స్​లో భారీగా..

ఫిలిప్పీన్స్​లో భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,958 కేసులు నమోదు కాగా మొత్తం వైరస్ సోకిన వారి సంఖ్య 1.36 లక్షలకు చేరింది.

అమెరికా ఖండంలో..

అమెరికాతో పాటు లాటిన్ అమెరికా దేశాల్లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. రెండు అమెరికా ఖండాల్లో కలిపి రోజుకూ లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఇక్కడ అధికంగానే ఉంది. సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, ఇరాన్​, రష్యా, దక్షిణాఫ్రికా, ఇండోనేసియాలోనూ వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

న్యూజిలాండ్ తరహాలో..

ఈ వారంలో కరోనా మరణాల సంఖ్య 7.5 లక్షలు దాటుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సారథి టెడ్రోస్ అధనోమ్ అంచనా వేశారు. ఇది బాధాకరమైన విషయమే అయినా గణాంకాలు ఇదే చెబుతున్నాయని ఆయన వెల్లడించారు. న్యూజిలాండ్ తరహాలో అన్ని దేశాలు కట్టడి చర్యలను సమర్థంగా అమలు చేయాలని సూచించారు.

దేశం కేసులు మరణాలు కోలుకున్నవారు
అమెరికా 52,01,064 1,65,620 26,64,980
బ్రెజిల్ 30,35,582 1,01,136 21,18,460
రష్యా 892,654 15,001 6,96,681
దక్షిణాఫ్రికా 5,59,859 10,408 4,11,474
మెక్సికో 4,80,278 52,298 3,22,465
పెరూ 4,78,024 21,072 3,24,020

ఇదీ చూడండి:కరోనా నియంత్రణ కష్టమే: డబ్ల్యూహెచ్​ఓ

ABOUT THE AUTHOR

...view details