తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇండోనేసియాలో భారీ భూకంపం- సునామీ హెచ్చరికలు!

Indonesia triggers tsunami
Indonesia triggers tsunami

By

Published : Dec 14, 2021, 9:53 AM IST

Updated : Dec 14, 2021, 12:33 PM IST

09:49 December 14

ఇండోనేసియాలో భారీ భూకంపం- సునామీ హెచ్చరికలు!

Indonesia earthquake todayఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. సముద్రగర్భంలో వచ్చిన ఈ భూకంపం తీవ్రత 7.3గా నమోదైంది. సునామీ అవకాశాలు ఉన్నాయని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది.

Undersea quake in Indonesia

సముద్రానికి 18.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. మౌమెరే పట్టణానికి 112 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది.

సహాయక చర్యలు..

భూప్రకంపనలు స్థానికంగా తీవ్ర అలజడి కలిగించాయని జాతీయ విపత్తు నియంత్రణ ఏజెన్సీ ప్రతినిధి అబ్దుల్ ముహారీ తెలిపారు. ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారని వెల్లడించారు. ప్రస్తుతానికి భూకంప నష్టంపై సమాచారం లేదని చెప్పారు. విపత్తు స్పందన దళాలు వెంటనే స్పందించి సహాయక చర్యలు ప్రారంభించాయని వివరించారు. ప్రాణ, ఆస్తి నష్ట వివరాలు సేకరిస్తున్నారని స్పష్టం చేశారు.

ఇండోనేసియాలో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి. ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులే ఇందుకు కారణం. గత జనవరిలో సంభవించిన 6.2 తీవ్రత గల భూకంపం 105 మందిని బలితీసుకుంది. పశ్చిమ సులవేసి ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది. ఈ ఘటనలో 6,500 మందికి పైగా గాయపడ్డారు.

ఇదీ చదవండి:'ఒమిక్రాన్​తో ఆ ఒక్క దేశంలోనే 75వేల మరణాలు!'

Last Updated : Dec 14, 2021, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details