ఏకకాలంలో అంటార్కిటాలోని దక్షిణ షెట్‌ల్యాండ్ దీవులను, మధ్య చిలీని భూకంపాలు కుదిపేసాయి. షెట్‌ల్యాండ్ దీవుల్లో రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదైంది. ఈ మేరకు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 9.6 కి.మీ.ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.
మధ్య చిలీలో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. 110 కి.మీల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికిల్ సర్వే తెలిపింది. దక్షిణ షెట్‌ల్యాండ్ దీవుల్లో భూకంపంతో పాటు సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చిలీ అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.