చైనాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం సంభవించిన సుడిగుండాల కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మధ్య, తూర్పు చైనా ప్రాంతాల్లో వచ్చిన ఈ తీవ్రమైన తుపానులకు 200 మందికి పైగా గాయపడ్డట్టు సమాచారం.
వుహాన్లో టోర్నడో ప్రభావానికి ఆరు మంది మృతిచెందగా.. 218 మంది గాయపడ్డారు. గంటకు 86 కిలోమీటర్ల వేగంతో వస్తున్న టోర్నడో రాత్రి 8.40 గంటలకు ఆ ప్రాంతాన్ని తాకినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అనేక చెట్లు, నిర్మాణ స్థలాల్లోని షెడ్లు నేలమట్టం అయ్యాయి.