ఇండోనేసియాను మరోమారు భారీ భూకంపం(earthquake indonesia) వణికించింది. తూర్పు ప్రాంతంలోని పపువా బరాత్ రాష్ట్రంలో గురువారం తెల్లవారుజామున భూమి కంపించినట్లు ఆ దేశ వాతావరణ, భూగోళ శాస్త్ర విభాగం వెల్లడించింది. అయితే, సునామీ సూచనలేమీ కనిపించలేదని తెలిపింది.
ఇండోనేసియాలో భారీ భూకంపం- రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రత - ఇండోనేసియాలో భూకంపం
ఇండోనేసియాలో భారీ భూకంపం(earthquake indonesia) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రత నమోదైంది.
ఇండోనేసియాలో భారీ భూకంపం
కైమానా జిల్లా కేంద్రానికి 115 కిలోమీటర్ల దూరంలో.. సముద్ర గర్భం కింద 14 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇదీ చూడండి:తైవాన్‌లో భారీ భూకంపం- రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రత