తెలంగాణ

telangana

ETV Bharat / international

'అఫ్గాన్​ ఘర్షణల్లో 59 మంది మృతి' - అఫ్గానిస్తాన్ తిరుగుబాటు కార్యకలాపాలు

అఫ్గానిస్థాన్‌లో జరిగిన ఘర్షణల్లో 59 మంది మరణించారని స్థానిక యుద్ధ పర్యవేక్షణ బృందం వెల్లడించింది. మృతుల్లో.. 42 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిపింది. 9 మంది భద్రతా దళ సిబ్బంది, 8 మంది పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.

59 killed in violent incidents in 24 hours in Afghanistan
అఫ్గాన్​ ఘర్షణలు: 24గంటల్లో 59 మంది హతం

By

Published : Apr 7, 2021, 3:32 PM IST

అఫ్గానిస్థాన్‌లో జరిగిన తిరుగుబాటు కార్యకలాపాలు, ఘర్షణల్లో 59 మంది మరణించినట్లు స్థానిక యుద్ధ పర్యవేక్షణ బృందం 'రిడక్షన్ ఇన్ వయలెన్స్(రివి) బుధవారం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఎనిమిది మంది పౌరులు, తొమ్మిది మంది అఫ్గాన్ నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ (ఏఎన్​డీఎస్​ఎఫ్​) సిబ్బంది, 42 మంది తాలిబన్ ఉగ్రవాదులు మరణించినట్లు తెలిపింది.

ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది రివి. అదే సమయంలో 30 మంది పౌరులు, 38 తాలిబాన్ ఉగ్రవాదులు, ఏడుగురు భద్రతా దళ సభ్యులు గాయపడ్డారని తెలిపింది.

ఏడు రాష్ట్రాల్లో 15 హింసాత్మక ఘటనలు జరిగాయని రివి పేర్కొంది. ఈ ప్రాంతాల్లోనే ప్రాణనష్టం సంభవించిందని వెల్లడించింది.

ఇదీ చదవండి:అఫ్గాన్​లో కారు బాంబు దాడి- 8 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details