జపాన్ తీరంలో ఉన్న విహార నౌక డైమండ్ ప్రిన్సెస్‌లో.. వైరస్ సోకని ప్రయాణికులను నౌక నుంచి తరలిస్తున్నారు. ఈ నౌకలో ఇప్పటి వరకు 542 మంది కరోనా వైరస్ సోకింది. 14 రోజుల నిర్బంధ కాలం ముగియసినందున.. దాదాపు వైరస్ సోకని 5 వందల మంది ప్రయాణికులకు నౌక నుంచి వెళ్లేందుకు అధికారులు అనుమతినిచ్చారు.
డైమండ్ ప్రిన్సెస్ నౌకలో కరోనా సోకని వారికి విముక్తి - First passengers disembark from Diamond Princess in Japan
జపాన్ నౌక నుంచి కరోనా వైరస్ సోకని ప్రయాణికులను తరలిస్తున్నారు అధికారులు. 14 రోజుల నిర్బంధ కాలం ముగిసినందున ఆరోగ్యంగా ఉన్న ఐదు వందల మందిని నౌక నుంచి వెళ్లేందుకు అనుమతిచ్చారు. ఇప్పటివరకు నౌకలోని 542 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు.
'14 రోజులు గడిచాయి.. కరోనా సోకనివారు వెళ్లొచ్చు'
వీరందరికీ వైరస్ సోకలేదని ధ్రువపత్రం కూడా ఇచ్చారు. హంకాంగ్‌లో దిగిన ఓ ప్రయాణికుడికి వైరస్ లక్షణాలు కనిపించినందున... మొత్తం 3వేల 711 మందితో కూడిన ఈ నౌకను జపాన్‌లోని యోకొహోమా తీరంలోనే నిలిపివేశారు. అప్పటి నుంచి నౌకను నిర్బంధంలో ఉంచారు.
ఇదీ చదవండి:ఇకపై మా దేశంలో చైనీయులకు నో ఎంట్రీ: రష్యా
Last Updated : Mar 1, 2020, 7:50 PM IST
TAGGED:
Coronavirus Latest Updates