తెలంగాణ

telangana

ETV Bharat / international

'సమాజంపై పగ' పేరుతో పిల్లలపై రసాయన దాడి

చైనాలో ఓ వ్యక్తి పాఠశాలలోని విద్యార్థులపై ప్రమాదకర రసాయనాన్ని వెదజల్లాడు. ఈ ఘటనలో 51 మంది పిల్లలు, ముగ్గురు ఉపాధ్యాయులు గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

51 children, three teachers hurt in chemical attack on kindergarten in China

By

Published : Nov 12, 2019, 7:03 PM IST

చైనాలోని యువాన్​ రాష్ట్రం కైయువాన్​లో ఓ వ్యక్తి పాఠశాలపై రసాయన దాడికి పాల్పడ్డాడు. కిండర్​గార్టెన్​ భవనంపైకి ఎక్కి సోడియం హైడ్రాక్సైడ్​(కాస్టిక్ సోడా)ను విద్యార్థులపైకి వెదజల్లాడు. ఈ ఘటనలో 51మంది పిల్లలు, ముగ్గురు ఉపాధ్యాయులకు కాలిన గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది.

పాఠశాలలే టార్గెట్​

రసాయన దాడి నేపథ్యంలో పాఠశాల వద్ద 40 నిమిషాలు హైడ్రామా సాగింది. పోలీసులు అతి కష్టం మీద దుండగుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని 23 ఏళ్ల కోంగ్​గా గుర్తించారు. నిరాశ, నిస్పృహలో కూరుకుపోయి... సమాజంపై ప్రతీకారం తీర్చుకోవాలన్న దురాలోచనతోనే కోంగ్​ ఈ పని చేశాడని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.

సమాజంపై ప్రతీకారం పేరిట చైనాలో పాఠశాలలపై దాడులు చేయడం ఇటీవల సర్వసాధారణమైంది. సెప్టెంబర్​లో ఓ వ్యక్తి పాఠశాలలో కత్తితో వీరంగం సృష్టించి ఇద్దరిని బలిగొన్నాడు. మేలో మరో వ్యక్తి కారుతో దూసుకెళ్లి 13 మందిని గాయపరిచాడు.

ఇదీ చూడండి:'జీడీపీ ఆధార సంవత్సరం మార్పు నిర్ణయం సరికాదు!'

ABOUT THE AUTHOR

...view details