పాకిస్థాన్లో ఓ శక్తిమంతమైన బాంబు పేలుడు కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గాయపడ్డారు. అఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతంలోని బలూచిస్థాన్ రాష్ట్రం చమాన్ నగరం హాజీ నిదా మార్కెట్లో ఈ పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు.
అయితే ఈ దాడులకు ఇంకా ఎవరూ బాధ్యత ప్రకటించుకోలేదు.