తెలంగాణ

telangana

ETV Bharat / international

నేపాల్​లో భూకంపం-బిహార్​లోనూ ప్రకంపనలు

సరిహద్దు దేశం నేపాల్​లో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 6 తీవ్రత నమోదైంది. ఉత్తర భారతంపైనా భూకంపం స్వల్ప ప్రభావం చూపించింది.

5.4 magnitude earthquake jolts Kathmandu early in the morning
నేపాల్​లో భూకంపం-బిహార్​లో ప్రకంపనలు

By

Published : Sep 16, 2020, 7:26 AM IST

Updated : Sep 16, 2020, 7:33 AM IST

నేపాల్​లోని కాఠ్​మాండూలో ఉదయం 5.19 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 6 తీవ్రత నమోదైంది. సింధుపాల్​చోక్​ జిల్లా రాంచే వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 2015లో సంభవించిన భూకంపం, వరదల తాకిడికి ఇప్పటికే ఈ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. ఇప్పుడు భూకంపం.. మరోసారి స్థానికుల్ని తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

కొన్ని చోట్ల తీవ్ర భూప్రకంపనలు వచ్చినట్లు నేపాల్​ భూకంప కేంద్రం(ఎన్​సీఎస్​) తెలిపింది. ఆస్తి, ప్రాణ నష్టంపై ఇంకా సమాచారం లేదు.

బిహార్​లోనూ..

నేపాల్​లో భూకంపం.. సరిహద్దు దేశం భారత్​పైనా స్వల్పంగా ప్రభావం చూపించింది. ఉత్తరాది రాష్ట్రం బిహార్​లో ప్రకంపనలు వచ్చాయి. షాక్​తో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అయితే.. ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.

2015లో సంభవించిన భూకంపం నేపాల్​ను వణికించింది. 7.9 తీవ్రత నమోదుకాగా.. 10 వేల మందికిపైగా చనిపోయారు. మరో వేలాదిమంది గాయపడ్డారు.

Last Updated : Sep 16, 2020, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details